Thursday 23rd April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > “భారత్, చైనా నాగరికతకు పుట్టినిల్లు”.. ట్రంప్ నకు ఇరాన్ కౌంటర్!

“భారత్, చైనా నాగరికతకు పుట్టినిల్లు”.. ట్రంప్ నకు ఇరాన్ కౌంటర్!

iran flag

Iran counter to Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను రీపోస్ట్ చేయడంపై అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

భారత్, చైనాలను ‘నరకం’ తో పోల్చిన సావేజ్ లేఖను ట్రంప్ సమర్థించడంపై ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ దీనిపై ఒక పవర్‌ఫుల్ పోస్ట్‌ ను పెట్టింది.

భారత్, చైనా దేశాలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు సజీవమైన నాగరికతలకు పుట్టినిల్లు అని ఇరాన్ పేర్కొంది. 4 వేల ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర, సంస్కృతి ఈ దేశాల సొంతమని గుర్తు చేసింది.

“నాగరికతలను నాశనం చేస్తానని బెదిరించే ఒక యుద్ధ నేరస్తుడైన అధ్యక్షుడు, ఈ మహోన్నత దేశాలను నరకం అనడమే అసలైన నరకం” అంటూ ఇరాన్ ఘాటుగా విమర్శించింది.

గతంలో ఇరాన్ నాగరికతను అంతం చేస్తానని ట్రంప్ చేసిన హెచ్చరికలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ఈజిప్టు, మెసొపొటేమియా వంటి నాగరికతలు అంతమైనా.. సింధు, హోయాంగ్ హో నది తీరాల్లో వికసించిన భారత్, చైనా నాగరికతలు ఇప్పటికీ బలంగా ఉన్నాయని ఇరాన్ కొనియాడింది.

250 ఏళ్ల చరిత్ర కూడా లేని అమెరికా వేల ఏళ్ల చరిత్ర కలిగిన దేశాలను విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions