Tuesday 9th June 2026
12:07:03 PM
Home > తాజా > ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: పురుషులకూ ‘ఫ్రీ’ బస్సు ప్రయాణం!  

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: పురుషులకూ ‘ఫ్రీ’ బస్సు ప్రయాణం!  

tgsrtc

Free bus travel for men in Telangana | తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రాష్ట్ర రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెజారిటీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

అయితే, ఈ ప్రక్రియలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలకే కాకుండా పురుషులకు కూడా ‘ఉచిత’ బస్సు ప్రయాణం లభిస్తోంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్ల సహాయంతో కొన్ని బస్సులను రోడ్లపైకి తెచ్చింది. కానీ, ఈ బస్సుల్లో కండక్టర్ల కొరత తీవ్రంగా ఉంది.

హన్మకొండ మరియు గోదావరి ఖని డిపోల పరిధిలో నడుస్తున్న బస్సుల్లో కండక్టర్లు లేకపోవడంతో, ప్రయాణికులు టికెట్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో మహిళలతో పాటు పురుషులు కూడా రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణిస్తున్నారు.

నగరంలో ప్రభుత్వం నడుపుతున్న అద్దె బస్సుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టికెట్లు జారీ చేసేవారు లేకపోవడంతో ప్రయాణికులు ఉచితంగానే తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

ఒకవైపు ఉచిత ప్రయాణం కొంతమందికి ఆనందాన్ని ఇస్తున్నా, బస్సులు సమయానికి లేక, ఉన్న బస్సుల్లో విపరీతమైన రద్దీ కారణంగా సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్ల మధ్య చర్చలు ఫలించకపోవడంతో ఈ అనిశ్చితి కొనసాగుతోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions