Sunday 20th September 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Jupally krishna rao
  • శాస‌న స‌భ‌లో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు
  • ఎక్సైజ్ ఆదాయంపై ఎమ్మెల్యే హ‌రీష్ రావుకు మంత్రి కౌంట‌ర్

Minister Jupally Counter To Harish Rao | తెలంగాణలో విచ్చ‌ల‌విడిగా మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రొత్స‌హించిందెవ‌రని మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీ లో ప్రశ్నించారు.

తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.10 వేల కోట్ల లోపు ఉండేదని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.35 వేల కోట్లకు పెరిగిందని ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు.

అసెంబ్లీలో బ‌డ్జెట్ పై ఎమ్మెల్యే హ‌రీష్ రావు మంత్రి జూప‌ల్లి కౌంట‌ర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన త‌ర్వాత ఈ రెండేళ్లలో ట్యాక్సుల‌ను పెంచ‌లేద‌న్నారు.

తెలంగాణలో 2025-27 కొత్త మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి, సుమారు ₹2,800 కోట్ల ఆదాయం దరఖాస్తుల రూపంలోనే వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు.

అసలు రాష్ట్రంలో మద్యాన్ని ప్రోత్సాహించింది ఎవరు?.. తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేసింది ఎవరో.. ఈ లెక్కలను చూస్తే తెలిసిపోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తేల్చి చెప్పారు.

ఉమ్మ‌డి పాల‌న‌లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.65 వేల కోట్లకు మించి పోలేదని.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో లక్షల కోట్లకు చేరిందని అన్నారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions