Indians Stranded in Pakistan | ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel)-అమెరికా (America) సంయుక్త దాడులు చేయడం ఇందులో భాగంగా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Khameni) మరణించడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ప్రతీకార చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్ తో సహా గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుంది.
ఈ తరుణంలో ఎనమిది మంది భారతీయులు పాకిస్థాన్ దేశంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో ఎనిమిది మంది భారతీయులు చిక్కుకుపోయారు. అజర్బైజాన్‌లోని బాకు నుంచి షార్జా మీదుగా కువైట్‌కు వెళ్తున్న ఎయిర్ అరేబియా విమానంలో ఈ ఎనిమిది మంది ఉన్నారు. గల్ఫ్ దేశాల గగణతలాలు మూసివేయడంతో విమానం కరాచీలో దిగవలసి వచ్చింది.
ఇప్పుడు గల్ఫ్‌కు విమానాలు రద్దు కావడంతో వారు కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వీరిలో ముగ్గురు కేరళవాసులు. పాలక్కాడ్ జిల్లాకు చెందిన కృష్ణదాస్ నాగల్లూర్, ఆయన భార్య డాక్టర్ రేష్మి మేనన్, వారి మూడేళ్ల కుమార్తె స్మృతి మేనన్. మిగిలిన ఐదుగురు కూడా అదే విమానంలో కువైట్ వెళ్తున్నారు.
కేరళ ప్రభుత్వం యొక్క నోర్కా రూట్స్ సంస్థ వారితో మాట్లాడుతూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)తో సమన్వయం చేసుకుంటోంది. వారిని శ్రీలంకలోని కొలంబో మీదుగా భారత్‌కు తీసుకురావాలని కేంద్రం ప్రణాళిక వేస్తోంది. కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ సంఘర్షణ వల్ల ఇరాన్, గల్ఫ్ దేశాల్లో వేలాది భారతీయులు చిక్కుకుపోయినట్లు కథనాలు వస్తున్నాయి.








