Sunday 6th September 2026
12:07:03 PM
Home > తాజా > రాంచరణ్ ఇంటికి జపాన్ అభిమానులు

రాంచరణ్ ఇంటికి జపాన్ అభిమానులు

Ram Charan Meets Japanese Fans | టాలీవుడ్ నటులకు జపాన్ లో అభిమానులు ఎక్కువ అనే విషయం తెల్సిందే. గ్లోబల్ స్టార్ రాంచరణ్ కు కూడా జపాన్ లో భారీ క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జపాన్ ప్రేక్షకులు రాంచరణ్ నటనకు వీరాభిమానులు అయ్యారు. ఈ క్రమంలో తాజగా కొందరు జపాన్ కు చెందిన అభిమానులు రాంచరణ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రాంచరణ్ వారిని ఇంటికి ఆహ్వానించారు. కాసేపు వారితో ముచ్చటించారు.

ఈ సందర్భంగా జపాన్ ఫ్యాన్స్ రాంచరణ్ పై తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఓ యువతి ఆర్ఆర్ఆర్ సినిమాను 100 సార్లు చూసినట్లు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం రాంచరణ్ వారికి ఆటోగ్రాఫులు ఇచ్చారు. ఈ సమయంలో జపాన్ అభిమానులు పెద్ది టీ షర్టులు ధరించడం విశేషం. బుచ్చిబాబు-రాంచరణ్ కాంబోలో పెద్ది తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions