Monday 10th August 2026
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్ లో ‘ఆపరేషన్ కవచ్’..150 ప్రాంతాల్లో

హైదరాబాద్ లో ‘ఆపరేషన్ కవచ్’..150 ప్రాంతాల్లో

Hyderabad Police launch ‘Operation Kavach’ | హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి ‘ఆపరేషన్ కవచ్’ (Operation Kavach) పేరుతో నగరవ్యాప్తంగా పోలీసులు విస్తృతమైన నాకాబందీని నిర్వహించారు. ​హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ​

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో లా అండ్ ఆర్డర్ (Law & Order), ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్ మరియు పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. ​ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ సీపీ సజ్జనర్ కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భద్రత – తమ బాధ్యత అని సజ్జనర్ స్పష్టం చేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions