Saturday 30th May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘బాబు గారు..గ్లోబల్ సమ్మిట్ కు రండి’

‘బాబు గారు..గ్లోబల్ సమ్మిట్ కు రండి’

Telangana invites CM Chandrababu to Global Summit | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ జరగనున్న విషయం తెల్సిందే. ఈ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో రాజకీయ, సినీ, పారిశ్రామిక మరియు క్రీడా ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పంపుతుంది.

ఇందులో భాగంగా సీఎం చంద్రబాబును కలిసి మంత్రి కోమటిరెడ్డి గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం అందజేశారు. దావోస్ నమూనాలో జరిగే ఈ సమ్మిట్‌లో ప్రపంచ, జాతీయ పరిశ్రమల నేతలు, నిపుణులు పాల్గొననున్నారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను $3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ ను ఈ వేదికపై ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే వేదికగా ఈ సమ్మిట్ నిలుస్తుందని చంద్రబాబుకు కోమటిరెడ్డి వివరించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions