Thursday 15th October 2026
12:07:03 PM
Home > తాజా > ‘కేసీఆర్ దీక్ష లేకుండా ఆ ప్రకటన లేదు..ఆ ప్రకటన లేకుండా తెలంగాణ లేదు’

‘కేసీఆర్ దీక్ష లేకుండా ఆ ప్రకటన లేదు..ఆ ప్రకటన లేకుండా తెలంగాణ లేదు’

Harish Rao News | ‘రానే రాదు, కానే కాదు’ అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత కేసిఆర్ ది అని పేర్కొన్నారు మాజీ మంత్రి, బీఆరెస్ నేత హరీష్ రావు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్‌ 29న ప్రారంభించిన ఆమరణ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్పిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందని తెలిపారు.

పదవులే కాదు, తెలంగాణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ ధీరత్వం కేసీఆర్ ది అని, తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం కేసీఆర్ అని హరీష్ పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల్లో మార్మోగే ‘జై తెలంగాణ’ అనే రణ నినాదం కేసీఆర్ అని నవంబర్‌ 29న కేసీఆర్‌ దీక్ష లేకుండా డిసెంబర్‌ 9 ప్రకటన లేదు, డిసెంబర్‌ 9 ప్రకటన లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కెసిఆర్ దీక్షా కాలం ఉద్యమ జ్ఞాపకాలు తన గుండెలో పదిలంగా ఉన్నాయని హరీష్ చెప్పారు.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions