Tuesday 2nd June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సత్యసాయి బాబా శత జయంతి..పుట్టపర్తిలో ప్రధాని

సత్యసాయి బాబా శత జయంతి..పుట్టపర్తిలో ప్రధాని

PM Modi participates in birth centenary celebrations of Sri Sathya Sai Baba at Puttaparthi | సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పుట్టపర్తికి చేరుకున్నారు. పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.

అనంతరం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి ప్రధాని చేరుకున్నారు. సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో బాబా జీవితం, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, నాలుగు పోస్టల్ స్టాంపులను ప్రధాని అవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్య రాయ్ తదితరులు హాజరయ్యారు. అంతకంటే ముందు సత్యసాయి బాబాను ఉద్దేశించి ప్రధాని ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ చేశారు.

సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం సత్యసాయి బాబా జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. సత్యసాయితో సంభాషించడానికి మరియు ఆయన నుండి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు తనకు వివిధ అవకాశాలు లభించాయని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు సత్యసాయితో కలిసున్న ఫోటోలను ప్రధాని షేర్ చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions