Thursday 15th October 2026
12:07:03 PM
Home > తాజా > ఏసీబీ అధికారులను చూసి పరుగందుకున్న ఎస్సై

ఏసీబీ అధికారులను చూసి పరుగందుకున్న ఎస్సై

Villagers Celebrate Arrest of Tekmal SI in Rs.30,000 Bribe Case Telangana | తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులను చూసి ఓ ఎస్సై పరుగందుకున్నాడు. ఏసీబీ అధికారులకు చిక్కకుండా పంట పొలాల్లో దూరి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

అయినప్పటికీ ఏసీబీ అధికారులు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కేంద్రంలోని స్టేషన్ లో ఎస్సైగా రాజేష్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఓ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సరిగ్గా రూ.30 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా ఎస్సైని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు వచ్చారు.

అధికారులను చూసిన ఎస్సై వెంటనే పారిపోయేందుకు ప్యాయత్నించాడు. పక్కనే ఉన్న పంట పొలాల వెంబడి లగెత్తాడు. ఏసీబీ అధికారులు వెంబడించి ఎస్సైని పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. మరోవైపు ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కడంతో గ్రామస్థులు స్టేషన్ ముందు టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions