Saturday 19th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖకు గూగుల్..ప్రధానికి సుందర్ పిచాయ్ ఫోన్

విశాఖకు గూగుల్..ప్రధానికి సుందర్ పిచాయ్ ఫోన్

Sundar Pichai calls Vizag AI hub a landmark as Google invests $15 billion | విశాఖపట్నంలో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. వైజాగ్ ను ఏఐ సిటీగా మార్చే విధంగా గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, గూగుల్ ప్రతినిధులు ప్రకటించారు.

ఈ మేరకు ఢిల్లీలో జరిగిన ‘భారత్ ఏఐ శక్తి’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గూగుల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. భారత ప్రధాని ప్రధానమంత్రితో ఈ పెట్టుబడిపై మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. విశాఖపట్నంలో మొట్టమొదటి గూగుల్ AI హబ్ విశేషాలను, ప్రణాళికలను ప్రధానితో పంచుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ హబ్ గిగావాట్-స్థాయి కంప్యూట్ సామర్థ్యం, కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, మరియు పెద్ద-స్థాయి ఎనర్జీ మౌలిక సదుపాయాలను కలిగి ఉందని సుందర్ పిచాయ్ వివరించారు. దీని ద్వారా సాంకేతికతను భారతదేశంలోని సంస్థలకు మరియు వినియోగదారులకు అందించనున్నట్లు AI ఆవిష్కరణలను వేగవంతం చేస్తూ దేశవ్యాప్తంగా వృద్ధిని ప్రోత్సహించనున్నట్లు పిచాయ్ ప్రకటించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions