Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > విజయ్ తో నిశ్చితార్థం..క్లారిటీ ఇచ్చిన రష్మిక

విజయ్ తో నిశ్చితార్థం..క్లారిటీ ఇచ్చిన రష్మిక

Rashmika Mandanna clears the air about the buzz around her engagement with Vijay Deverakonda | ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇరువురు కలిసి పలు సందర్భాల్లో ఎయిర్పోర్ట్ లో దర్శనమివ్వడం ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లైంది.

అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, రష్మీక స్పందించలేదు. ఇదే సమయంలో వీరిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వినిపించాయి. దీనికి ప్రధాన కారణం, ఇటీవల దుబాయ్ వేదికగా ‘సైమా’ కార్యక్రమం జరిగింది. ఇందులో రష్మిక పాల్గొన్నారు.

అలాగే ‘పుష్ప-2’ లోని నటనకు గాను ఉత్తమ నటి అవార్డును సైతం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేతి వెలికి ధరించిన ఉంగరం చర్చనీయాంశంగా మారింది. విజయ్ దేవరకొండతో రహస్యంగా నిశ్చితార్థం జరిగినట్లు పలువురు కామెంట్లు పెట్టగా ఇది కాస్తా వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలో వైరల్ గా మారిన పుకార్లపై రష్మిక స్పందించారు. నిశ్చితార్థం అని జరుగుతున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఉంగరం తనకు సెంటిమెంట్ అని, అంతేకాని ఎలాంటి నిశ్చితార్థం జరగలేదని స్పష్టం చేశారు. రహస్యంగా నిశ్చితార్థం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions