Wednesday 15th April 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘జో రూట్ ఒక్క సెంచరీ చేయకపోయినా నగ్నంగా నడుస్తా’

‘జో రూట్ ఒక్క సెంచరీ చేయకపోయినా నగ్నంగా నడుస్తా’

Matthew Hayden About Joe Root | ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ మ్యాథ్యూ హేడెన్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆస్ట్రేలియా గడ్డపై జో రూట్ సెంచరీ చేసి తీరుతాడని, అలా జరగకపోతే తాను మెల్బోర్న్ స్టేడియంలో నగ్నంగా నడుస్తా అంటూ హేడెన్ సవాల్ విసిరారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ మైదానం వేదికగా నవంబర్ 21 నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ జరగనుంది.

ఇందులో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ జరగనుంది. ఇదే సమయంలో ప్రస్తుతం టెస్టు ఫార్మాట్ లో అద్భుతమైన ఫార్మ్ లో ఉన్న జో రూట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై రూట్ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు.

అయినప్పటికీ మ్యాథ్యు హేడెన్ మాత్రం జో రూట్ పై తనకున్న అంచనాలను బహిర్గతం చేసేశారు. యాషెస్ సిరీస్ లో భాగంగా రూట్ కచ్చితంగా సెంచరీ చేస్తారని, అలా చేయకపోతే తాను మెల్బోర్న్ స్టేడియంలో నగ్నంగా నడుస్తా అంటూ అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions