Sunday 6th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఫొటోకు లైక్ కొట్టిన కోహ్లీ..స్పందించిన యువ నటి

ఫొటోకు లైక్ కొట్టిన కోహ్లీ..స్పందించిన యువ నటి

Avneet Kaur breaks silence on Virat Kohli liking her picture | టీం ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఓ యువ నటి ఫొటోకు లైక్ కొట్టడం కొద్దిరోజుల కిందట వైరల్ గా మారిన విషయం తెల్సిందే.

యువ నటి అవనీత్ కౌర్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫొటోకు విరాట్ కోహ్లీ లైక్ చేశారు. దింతో అవనీత్ కౌర్ ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయారు. కోహ్లీ లైక్ చేసిన కేవలం గంటల వ్యవధిలోనే అవనీత్ కౌర్ కు రెండు మిలియన్ల మంది ఫాలోవర్లు పెరగడం విశేషం.

అంతేకాకుండా ఈ ఘటన తర్వాత కౌర్ తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలని 12 సంస్థలు ఆమెను సంప్రదించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన ఫోటోను లైక్ చేయడంపై తొలిసారి కౌర్ స్పందించారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘లవ్ ఇన్ వియత్నాం’ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చాలా పెద్ద సెలబ్రెటీలు కూడా ఫోటోలను లైక్ చేస్తున్నారని దీనిపై స్పందించాలని ఓ విలేకరు కౌర్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలో కౌర్ స్పందిస్తూ ‘ప్రేమ దొరుకుతూ ఉండాలి..దీనిపై ఇంకేం మాట్లాడలేను’ అంటూ కౌర్ తెలిపారు.

ఈ మాటలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా అవనీత్ కౌర్ ఫొటోను లైక్ చేయడంపై గతంలోనే కోహ్లీ స్పందించారు. ఇన్స్టా లో ఫీడ్ క్లియర్ చేస్తున్న సమయంలో పొరపాటున లైక్ బటన్ ప్రెస్ అయ్యిందని, దీని వెనుక ఎలాంటి ఉద్దేశ్యం లేదని కోహ్లీ క్లారిటీ ఇచ్చారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions