Sunday 20th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘పప్పూ నిద్ర వదులు’..జగన్ విమర్శలు

‘పప్పూ నిద్ర వదులు’..జగన్ విమర్శలు

Ys Jagan News Latest | కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదని నిలదీశారు.

మరోవైపు సోమవారం నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయని ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఈసెట్‌ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని గుర్తుచేశారు.

గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమని మండిపడ్డారు. ఈ సందర్భంగా అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అని జగన్ ఎద్దేవా చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions