Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > అవయవదానానికి సిద్ధం..కేటీఆర్ ప్రకటన

అవయవదానానికి సిద్ధం..కేటీఆర్ ప్రకటన

ktr

KTR Pledges To Donate Organs | అవయవదానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు.

అవయవదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం, అందరికీ ఆదర్శంగా నిలవాలని సభ్యులను ఉద్దేశించి కేటీఆర్ పిలుపునిచ్చారు.

నియోజకవర్గాల్లో కూడా అవయవదానం అంశంలో చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఆలోచన ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసన సభ ప్రాంగణంలోనే సంతకాల సేకరణ చేపడదామని స్పీకర్ కు కేటీఆర్ సూచించారు.

అవయవ దానం అనేది గొప్ప మానవీయ చర్య అని ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తుందని కేటీఆర్ కామెంట్ చేశారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions