Monday 15th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కాంగ్రెస్ పార్టీ కొత్త ఆఫీస్ ప్రారంభం.. ఈ భవనం పేరేంటో తెలుసా!

కాంగ్రెస్ పార్టీ కొత్త ఆఫీస్ ప్రారంభం.. ఈ భవనం పేరేంటో తెలుసా!

indira bhavan

Congress Party New Office | దేశ రాజధాని న్యూదిల్లీ (New Delhi)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కొత్త కార్యాలయాన్ని నిర్మించింది. కోట్లా రోడ్‌లోని 9 ఏలో నిర్మించిన ఈ పార్టీ ఆఫీస్ కు బుధవారం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యాలయానికి ఇందిరా భవన్ (Indira Bhavan) అని నామకరణం చేశారు.

5 అంతస్థులతో అన్ని రకాల సౌకర్యాలతో ఈ కొత్త కార్యాలయాన్ని నిర్మించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సహా పార్టీకి చెందిన 400 మంది ముఖ్య నేతల సమక్షంలో ఇందిరా భవన్ ను ప్రారంభించారు.

ఐదో అంతస్తులో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు తమ రిజిస్టర్డ్ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లో నిర్వహించకూడదని 2006లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కొత్త భవన నిర్మాణానికి 2009లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ భూమిపూజ చేశారు. అయితే ఈ భవనం నిర్మాణం పూర్తి కావడానికి 15 సంవత్సరాలు పట్టింది.

You may also like
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనమా..? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్!
kcr revanth
ఇదేక్కడి జాతిపిత లక్షణం.. కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శలు!
rahul gandhi
ఈసీకి రాహుల్ గాంధీ 5 ప్రశ్నలు!
BJP Kishan REddy
ఆ అవసరం మాకు లేదు.. కాంగ్రెస్ నేతలకు కిషన్ రెడ్డి కౌంటర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions