Tuesday 24th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పిల్లలు కావాలంటే నల్ల కోడిపిల్లను మింగు..మాంత్రికుడి మాటలు నమ్మి

పిల్లలు కావాలంటే నల్ల కోడిపిల్లను మింగు..మాంత్రికుడి మాటలు నమ్మి

Chhattisgarh Man Swallows Live Chick | మంత్రాలకు చింతకాయలు రాలవు అని పెద్దలు పదే పదే చెప్పినా కొందరు మాత్రం పట్టించుకోరు.

ఇలానే ఓ మాంత్రికుడి మాయమాటలు నమ్మి వ్యక్తి ప్రాణాలనే కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

రాష్ట్రంలోని అంబికాపూర్ పట్టణానికి చెందిన 35 ఏళ్ల ఆనంద్ కుమార్ యాదవ్ ( Anand Kumar Yadav ) కు పెళ్లి అయినా పిల్లలు కలగలేదు. దీంతో ఆయన స్థానిక మాంత్రికుడిని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో పిల్లలు కలగాలంటే ఓ నల్ల కోడిపిల్లను అది బ్రతికుండగానే మింగాలని మాంత్రికుడు సూచించాడు.

అతని మాయమాటలు నమ్మిన ఆనంద్ కుమార్ ఓ నల్ల కోడిపిల్లను అమాంతం మింగేశాడు. దీంతో ఊపిరి ఆడక స్పృహ కోల్పోయాడు. వెంటనే అంబికాపూర్ లోని ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది.

ఊపిరి ఆడక ఆనంద్ కుమార్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions