Friday 11th September 2026
12:07:03 PM
Home > తాజా > పవన్ కళ్యాణ్ గురుంచి అల్లు అర్జున్ ఏమన్నారంటే !

పవన్ కళ్యాణ్ గురుంచి అల్లు అర్జున్ ఏమన్నారంటే !

Allu Arjun Praises Pawan Kalyan | నటసింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ( Unstoppable Talk Show )కు ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు.

బాలకృష్ణ, అల్లు అర్జున్ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం వైరల్ గా మారింది. తాను తెలుగు హీరోల తరఫున జాతీయ అవార్డును తీసుకున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు.

అలాగే పుష్ప పార్ట్-3 ( Pushpa Part-3 ) గురుంచి మాట్లాడారు. ఇప్పుడే చేయలేను, రెండు సంవత్సరాలకు కనీసం మూడు సినిమాలు అయినా తీయాలనేది తన లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power Star Pawan Kalyan ) ధైర్యం అంటే తనకు చాలా ఇష్టమని ఐకాన్ స్టార్ తెలిపారు.

చాలామంది లీడర్స్ ను చూశా, కానీ దగ్గరి నుండి చూసిన డేరింగ్ పర్సన్ ( Daring Person ) పవన్ కళ్యాణ్ అంటూ అల్లు అర్జున్ చెప్పారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కమ్ బ్యాక్స్ ( Comebacks ) అంటే తనకు చాలా ఇష్టమని, రెబెల్ స్టార్ ప్రభాస్ ఆరడుగుల బంగారం అంటూ కితాబిచ్చారు.

ఎపిసోడ్ మధ్యలో అల్లు అర్జున్ అమ్మ నిర్మల కూడా వచ్చి ఐకాన్ స్టార్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions