Tuesday 15th September 2026
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి..!

కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి..!

Cm Revanth Reddy Visited Kcr| మాజీ సీఎం, బీఆరెస్ ( Brs ) సుప్రీమో కేసీఆర్ ( Kcr ) ను సోమజిగూడలోని యశోదా ఆసుపత్రిలో పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy).

ఆదివారం మధ్యాహ్నం ఆసుపత్రికి చేరుకున్న సీఎం, కేసీఆర్ ను కలిసి ఆరోగ్యం పై ఆరా తీసి పరామర్శించారు. అలాగే వైద్యులను, కుటుంబసభ్యులను కలిసి సర్జరీ ( Surgery ) పై అడిగి తెలుసుకున్నారు.

త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆసుపత్రిలో మాజీ మంత్రులు కేటీఆర్ ( Ktr ), హరీష్ రావు ( Harish Rao ) లను కలిశారు సీఎం. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు కేసీఆర్ ఎడమ తుంటికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెల్సిందే.

ఆ తర్వాత వాకర్ ( Walker ) సహాయంతో కేసీఆర్ ను నడిపించారు వైద్యులు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించడం మంచి పరిణామం గా భావిస్తున్నారు.

కాగా వ్యక్తిగత వైరాలు పక్కనపెట్టి, సీఎం వెళ్లి ప్రతిపక్ష నేతను పరామర్శించడం మంచి సంప్రదాయం అని అంటున్నారు అందరూ. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క ( Seethakka ), సీనియర్ నేతలు షబ్బీర్ అలీ ( Shabbir Ali ), వేం నరేందర్ రెడ్డిలు ఉన్నారు.

You may also like
ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
cm revanth speech
ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం’: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
నగరంలో రోడ్ల వ్యవస్థ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions