Friday 1st May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > 2024లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : పవన్‌..

2024లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : పవన్‌..

In 2024, TDP and Janasena will form government together Pawan..

అమరావతి: 2024లో తెలుగుదేశం ` జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టానని తెలిపారు. తాను పార్టీని నడుపలేనని చాలామంది అన్నారు. 2019 నుంచి ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకుంటే .. ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసే వాళ్లమని కానీ ఇతర పార్టీల నుంచి నేను నాయకులను తీసుకోలేదని తెల్చిచెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచే దళిత సంఘాలు, బీసీల నాయకులతో తిరిగానని అన్నారు. తెలంగాణలో రెండు ఎన్నికలు గెలిచిన బీఆర్‌ఎస్‌ మూడో ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయిందని చెప్పారు. వెనుకబడిన వర్గాలు నిర్ణయాత్మక శక్తిగా మారాలని పిలుపునిచ్చారు.కులాలకు కేటాయించి నిధులు అ కులాలకు వెళ్లడం లేదన్నారు. అధికారం చూడని వారికి అధికారం ఇవ్వడమే నిజమైన సాధికారత అని తెలిపారు. తాను ఒంటరి తనాన్ని అనుభవించానని అవమానాలు కూడా పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన మాట నెలబెట్టుకోలేనేమో అని అనుక్షణం భయపడ్డానని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు…

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions