Wednesday 4th March 2026
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ లో చేరిన మరో సినీనటి!

కాంగ్రెస్ లో చేరిన మరో సినీనటి!

actress divya vani

Divyavani Joins Congress | అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరికలు ఊపందుకున్నాయి. ప్రధాన పార్టీ నాయకులే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరుతున్నారు.

ఇప్పటికే మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) కాంగ్రెస్ లో చేరగా, తాజాగా పెళ్లి పుస్తకం సినిమాతో విశేష ఆదరణ పొందిన నటి దివ్యవాణి (Divya Vani) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

బుధవారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రే (Manick Rao Thackeray) ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఖండువా కప్పుకున్నారు దివ్యవాణి.

విజయశాంతి, దివ్యవాణి వంటి నటీమణులు కాంగ్రెస్ లో చేరడం తో సినీ గ్లామర్ కూడా పార్టీకి దోహధపడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

కాగా దివ్యవాణి 2019 లో టీడీపీ(TDP) లో చేరారు అనంతరం 2022 లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా హస్తం గూటికి చేరారు.

You may also like
Election commission
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల!
సిగాచీ ప్రమాదం..జన్మదిన వేడుకలకు జగ్గారెడ్డి దూరం
చెప్పులు కూడా లేని చిన్నారి..మంత్రి సురేఖ ఏం చేశారంటే !
తెలంగాణ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions