Friday 22nd August 2025
12:07:03 PM
Home > తాజా > చిప్ప కూడు తిన్నా సిగ్గు రాలేదు..రేవంత్ పై కేసీఆర్ హాట్ కామెంట్స్!

చిప్ప కూడు తిన్నా సిగ్గు రాలేదు..రేవంత్ పై కేసీఆర్ హాట్ కామెంట్స్!

kcr news

KCR Fires On Revanth | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై నిప్పులు చెరిగారు బీఆరెస్ అధినేత కేసీఆర్.

బుధవారం కొడంగల్ (Kodangal) నియోజకవర్గంలో బీఆరెస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ… రేవంత్ ఒక భూకబ్జా దారుడని ఆరోపించారు.

రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నారని, ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని వ్యాఖ్యానించారు కేసీఆర్. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న సమయంలో రేవంత్ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకుల వద్ద ఉన్న వ్యక్తి రేవంత్ అని, తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ తీసుకొని వెళ్లిన వ్యక్తి టీపీసీసీ చీఫ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అప్పటి టీఆరెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి కుట్ర పన్నాడని, ఎమ్మెల్యే ను కొనుగోలు చేస్తూ రూ.50 లక్షల తో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ కన్నెర్ర చేశారు.

జైలులో చిప్ప కూడు తిన్న ఆయనకు సిగ్గు రాలేదని, నోరు తెరిస్తే గబ్బు అంటూ రేవంత్ లక్ష్యంగా మాటల తూటాలను వదిలారు గులాబీ అధిపతి.

You may also like
ktr
ఉప రాష్ట్రపతి ఎన్నికలో వారికే మా మద్దతు: కేటీఆర్!
kcr ktr
కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్..!
cm revanth reddy
ఈ ఒక్క పథకం విప్లవాత్మక మార్పులకు కారణమైంది: సీఎం రేవంత్ ట్వీట్!
kangana ranauth
‘నా దగ్గర డబ్బు, పదవి లేవు..’ కంగనా కామెంట్లపై కాంగ్రెస్ ఫైర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions