SBTS Co Founder Lakshmi Aitha | కేబీకే హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన దేశంలోని అతిపెద్ద ఫొటోట్రేడ్ ఎగ్జిబిషన్ సందర్భంగా వందేభారత్ ఫౌండేషన్ వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖులకు వందేభారత్ భీష్మ వశిష్ట పురస్కార్ అవార్డులు అందజేసింది.
అందులో భాగంగా హైదరాబాద్ లోని నారాయణ గూడలోని ప్రముఖ టాక్స్ కన్సల్టెన్సీ శ్రీబాలజీ టాక్స్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకులు శ్రీమతి వెంకట్ లక్ష్మి అయిత ఈ వందేభారత్ భీష్మ వశిష్ట పురస్కార్ కు ఎంపికయ్యారు.
మహిళా సాధికారతకు మద్దుతుగా గొప్ప సంకల్పంతో దాదాపు 90 శాతం మహిళా ఉద్యోగులతోనే కంపెనీని నిర్వహిస్తున్న ఆమె యంగ్ వుమన్ ఎంట్రప్రెన్యూర్ విభాగంలో ఈ అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా లక్ష్మి అయిత మాట్లాడుతూ యంగ్ ఎంట్రప్రెన్యూర్ విభాగంలో ఈ భీష్మ వశిష్ట పురస్కార్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డుకు ఎంపిక చేసిన వందేభారత్ ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు.

SBTS ఆఫీస్ ల మహిళా ఉద్యోగులతో లక్ష్మి అయిత
ప్రస్తుతం 1000 మందికి పైగా క్లయింట్స్ తో ఎస్బీటీఎస్ ను విజయవంతంగా నడిపిస్తున్నారు శ్రీమతి వెంకట లక్ష్మి అయిత.
ఎస్బీటీఎస్ సహ-వ్యవస్థాపకురాలిగా నిత్యం 50 మందికి పైగా ఉద్యోగులను సమన్వయం చేస్తూ అన్ని రకాల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు రిజిస్ట్రేషన్లు, లైసెన్సింగ్ పనులు, GST, ESI & PF, IT, ఆడిట్ పనులు, పేరోల్ తదితర విధులు నిర్వహిస్తున్నారు.
సామాజిక సేవలోనూ..
ఎస్‌బీటీఎస్‌లో బాధ్యతలతో పాటు సామాజిక సేవపై అమితాసక్తి ఉన్న లక్ష్మీ ఏటా రూ. 15వేలు చొప్పున ఆరుగురు విద్యార్థులకు వారి చదువుల నిమిత్తం ఆర్థిక సాయం అందిస్తున్నారు. తరచూ నిరుపేదల కోసం హైదరాబాద్ లో పలుచోట్ల అన్నదానాలు నిర్వహిస్తున్నారు.
కరోనా సంక్షోభంలో, వారు రోజుకు 300 మందికి చొప్పున 45 రోజులపాటు సుమారు 12 వేల మందికి పైగా పేద ప్రజలకు ఆహార పంపిణీ చేశారు. వీటితో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్ద ఎతున విరాళాలు అందిస్తున్నారు.






