Sunday 6th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఈసీ పై ఆరోపణలు..రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖుల లేఖ

ఈసీ పై ఆరోపణలు..రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖుల లేఖ

272 eminent citizens slam Rahul Gandhi for tarnishing ECI by ‘vote chori’ allegations | లోకసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖులు కలిసి ఓ లేఖ రాశారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడం పట్ల ఈ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే.

కేంద్ర ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని, ఇలా అత్యధిక రాష్ట్రాల్లో కాషాయ పార్టీ అధికారాన్ని చేపట్టిందని రాహుల్ ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో రాజకీయ లబ్ది కోసం ఆధారాలు లేని ఆరోపణలు చేయవద్దని ప్రముఖులు రాసిన లేఖలో ప్రస్తావించారు. 272 మంది ప్రముఖులు రాహుల్ కు ఈ మేరకు లేఖ రాశారు. ఇందులో 16 మంది మాజీ న్యాయమూర్తులు, 123 మంది మాజీ అధికారులు, 14 మంది మాజీ రాయబారులు, 133 మంది సైన్యంకు చెందిన మాజీ అధికారులు ఉన్నారు.

ఎన్నికల సంఘంలో పనిచేసే ఉద్యోగులను వదిలి పెట్టేదే లేదని రాహుల్ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వస్తే ఎలాంటి విమర్శలు చేయడం లేదని అదే ప్రతికూలంగా వస్తే ఎన్నికల సంఘంపై నెపం నెట్టేస్తున్నారని లేఖలో ప్రముఖులు రాహుల్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions