Saturday 17th October 2026
12:07:03 PM
Home > తాజా > డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసానికి విజయ్ దేవరకొండ – రష్మిక!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసానికి విజయ్ దేవరకొండ – రష్మిక!

  • బతుకమ్మ చీర కానుక!

Vijay Deverakonda Rashmika Mandanna Meets Bhatti Vikramarka తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసానికి సినీ నటుడు విజయ్ దేవరకొండ, ఆయన సతీమణి రష్మిక మందన్న దంపతులు మర్యాదపూర్వకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు వారికి సాదర స్వాగతం పలికారు.

వివాహానంతరం తొలిసారిగా తెలంగాణలో దసరా పండుగ జరుపుకుంటున్న రష్మిక మందన్నకు డిప్యూటీ సీఎం దంపతులు ప్రత్యేకంగా ‘బతుకమ్మ చీర’ను దసరా పండుగ కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

తొలి దసరా సంబరాలు..

పెళ్లి తర్వాత రష్మిక మందన్న తెలంగాణలో జరుపుకుంటున్న మొదటి దసరా పండుగ కావడంతో భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేకంగా పట్టు బతుకమ్మ చీరను బహుకరించి దసరా కానుక అందించారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ, దసరా పండుగల విశిష్టతను ఈ సందర్భంగా వారితో పంచుకుంటూ డిప్యూటీ సీఎం దంపతులు ఆ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

You may also like
2029 నాటికి ‘నషా ముక్త భారత్’: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!
telangana budget
ఉద్యోగులకు రూ. కోటి ఉచిత ప్రమాద బీమా!
విజయ్ దేవరకొండ ‘రణబలి’ విడుదల తేదీ ఖరారు!
telagnana budget
రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions