Saturday 1st August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన 15 ఏళ్ల బాలిక!

ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన 15 ఏళ్ల బాలిక!

Protester Apologizes PM Modi | ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూలై 23న జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన నిరసనకారిణి, ఆన్‌లైన్ వేదికగా ఒక వీడియో ద్వారా దేశ ప్రజలకు క్షమాపణలు తెలిపింది.

తన వయస్సు కేవలం 15 సంవత్సరాలని పేర్కొన్న ఆ బాలిక, తన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావానికి లోనై ఆ తప్పు చేశానని, చేతులు జోడించి వేడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది.

“అది నా మొదటి, చివరి తప్పు.. నన్ను క్షమించండి”

కానాట్ ప్లేస్ సందర్శించిన తర్వాత స్నేహితులతో కలిసి ఆ నిరసనకు వెళ్లానని సదరు బాలిక వెల్లడించింది.

“నేను ఆ వ్యక్తుల ప్రభావానికి లోనయ్యాను. నా వయసు కేవలం 15 ఏళ్లు. నేను చేసింది క్షమించదగినది కాదు, చాలా చెడ్డ మాటలు అన్నాను. దీనిని నా మొదటి మరియు చివరి తప్పుగా భావించి యావత్ దేశం నన్ను క్షమించాలి. చాలా సిగ్గుపడుతున్నాను, నన్ను నేను కూడా చూసుకోలేకపోతున్నాను.” అని బాలిక పేర్కొంది.

“యువతను క్షమిస్తున్నా” – ప్రధాని మోదీ సందేశం:

ఈ వీడియో వెలుగులోకి రావడానికి కొన్ని గంటల ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒక ముఖ్యమైన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నిరసన ప్రదర్శనలో తనను దూషించిన యువతను తాను క్షమిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.

“నాపైనా, నా దివంగత తల్లిపైనా ఉపయోగించిన దూషణాత్మక నినాదాలు తీవ్ర ఆవేదన కలిగించాయి. కానీ యువత తమ తప్పుల నుండి నేర్చుకోవడానికి సమాజం అవకాశం ఇవ్వాలి. వారికి శిక్ష విధించకుండా సరైన మార్గదర్శనం చేయాలి.”నరేంద్ర మోదీ

సీజేపీ స్పందన..

ఈ నిరసనను నిర్వహించిన బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి సౌరవ్ దాస్ ఎఫ్‌ఐఆర్‌పై స్పందిస్తూ.. అభ్యంతరకరమైన భాషను సహించకూడదని, అయితే ఇటువంటి వ్యాఖ్యలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం భావప్రకటనా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

దీనిపై క్రిమినల్ విచారణ కాకుండా పరువు నష్టం దావా వేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

You may also like
ఆ మాటలు బాధించాయి.. కానీ క్షమిస్తున్నా: ప్రధాని మోదీ!
పేపర్ లీక్ నిరోధక బిల్లుకు ఆమోదం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
కంగనా వ్యాఖ్యలపై సోనూ సూద్ ఫైర్..
నిర్భయంగా పనిచేయండి.. నాదే బాధ్యత.. సీఆర్పీఎఫ్ డైరక్టర్ జనరల్ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions