Friday 1st May 2026
12:07:03 PM
Home > Uncategorized > ఆగిపోయిన సినిమా.. రూ.32 కోట్ల బంగ్లా అమ్మేసిన స్టార్ హీరోయిన్!

ఆగిపోయిన సినిమా.. రూ.32 కోట్ల బంగ్లా అమ్మేసిన స్టార్ హీరోయిన్!

Kangana Ranaut Sells Her House | సినిమా విడుదల నిలిచిపోవడంతో ఓ స్టార్ హీరోయిన్ రూ.32 కోట్ల విలువ చేసే బిల్డింగ్ ను అమ్మేసినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranauth) ఇటీవల కాలంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తున్నారు.

ఇందులో భాగంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఒక మూవీని తెరకెక్కించారు. ఎమర్జెన్సీ సినిమాకు కంగనా దర్శకత్వం వహించడంతో సహా నిర్మాతగాను వ్యవహరించారు.

అయితే సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ మూలంగా సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ను నిలిపివేసింది. దింతో సినిమా విడుదల నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలో ముంబై లో రూ.32 బంగ్లా ను అమ్మేసినట్లు కంగనా రనౌత్ చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైన సినిమాను కచ్చితంగా విడుదల అవుతుందని ఆమె ధీమా వ్యక్తంచేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions