Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > భార్య వంట చేయడం లేదని విడాకుల పిటిషన్.. హైకోర్టు ఏమందంటే!

భార్య వంట చేయడం లేదని విడాకుల పిటిషన్.. హైకోర్టు ఏమందంటే!

telangana high court

Telangana Highcourt | హైదరాబాద్‌కు చెందిన ఓ భర్త, తన భార్య వంట చేయడం లేదనీ, దాన్ని మానసిక క్రూరత్వంగా పేర్కొంటూ విడాకుల కోసం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ను ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను హైకోర్టు స్పష్టంగా తిరస్కరించింది.

దాంపత్య జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న అసహనాలు, రోజువారీ ఒత్తిళ్లు విడాకులకు చట్టబద్ధమైన కారణాలు కావని కోర్టు తేల్చి చెప్పింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్, భార్య వంట చేయకపోవడం లేదా ఇంటి పనులను సరిగా సమన్వయం చేయలేకపోవడం, ప్రత్యేకించి ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు క్రూరత్వంగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది.

అలాంటి పరిస్థితుల్లో భార్య ఆహారం సిద్ధం చేయకపోవడాన్ని “తీవ్రంగా చూడాల్సిన అంశం కాదు” అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అలాగే, భర్త తన ఆరోపణలను నిరూపించే సరైన ఆధారాలు సమర్పించలేకపోయాడని కోర్టు గమనించింది.

దిగువ కోర్టు తీర్పులో ఎలాంటి చట్టవిరుద్ధత లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా, వివాహ జీవితంలో సహజంగా వచ్చే చిన్నపాటి విభేదాలు విడాకులకు సరిపోవని, హిందూ వివాహ చట్టం ప్రకారం ‘క్రూరత్వం’ అనేది తీవ్రమైన హాని లేదా ప్రమాదాన్ని సూచించాల్సి ఉంటుందని హైకోర్టు మరోసారి గుర్తు చేసింది.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions