Thursday 30th July 2026
12:07:03 PM
Home > తాజా > కాశీలో హెర్డింగ్ లపై వీడిన సస్పెన్స్.. వారణాసి సినిమా రిలీజ్ డేట్ ఇదే!

కాశీలో హెర్డింగ్ లపై వీడిన సస్పెన్స్.. వారణాసి సినిమా రిలీజ్ డేట్ ఇదే!

varanasi

Varanasi Movie Release Date | సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) , దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ (Varanasi Movie). పాన్ వరల్డ్  సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పురాణాలు, కాల ప్రయాణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని రోజుల కింద గ్లోబ్ ట్రాటర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ ఈ సినిమా విజువల్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు డైరక్టర్ రాజమౌళి. 2027 ఏప్రిల్ 7 ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా లో రిలీజ్ డేట్ తో ఓ పోస్టర్ విడుదల చేశారు.

కాగా, గురువారం వారణాసి పట్టణంలో 2027 ఏప్రిల్ 7 తేదీతో భారీ హోర్డింగ్ లు వెలిశాయి. దాదాపు గా ఈ సినిమా రిలీజ్ డేట్ అయ్యుంటుందని అందరూ అంచనా వేశారు. తాజాగా రాజమౌళీ పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేశారు.

You may also like
‘కాంతార’ హీరో రిషబ్ శెట్టికి అరుదైన అంతర్జాతీయ గౌరవం!
సోషల్ మీడియా ట్రోల్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..!
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
మహేష్-రాజమౌళి బిగ్ ఫైట్..వీడియో వైరల్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions