Saturday 12th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బిహార్ అమ్మాయిలపట్ల మంత్రి భర్త అనుచిత వ్యాఖ్యలు!

బిహార్ అమ్మాయిలపట్ల మంత్రి భర్త అనుచిత వ్యాఖ్యలు!

girdhari lal

BJP Leader Comments On Bihar Women | మహిళల పట్ల ఓ మంత్రి భర్త చేసిన అవమానకర వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి.

ఉత్తరాఖండ్ క్రీడా శాఖ మంత్రి రేఖా ఆర్య (Rekha Arya) భర్త అయిన గిర్ధారి లాల్ (Girdari Lal) ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లుడుతూ బిహార్ అమ్మాయిలపై అనుచిత కామెంట్స్ చేశారు.

ఒక యువకుడిని పెళ్లి ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించిన గిర్ధారి లాల్, బిహార్ నుంచి 20 నుంచి 25 వేల రూపాయలకే అమ్మాయిలు దొరుకుతారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేస్తూ ఆయన నవ్వడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో గిర్ధారి లాల్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఇది బీహార్ మహిళల పట్ల బీజేపీ మద్దతుదారుల వికృతమైన మనస్తత్వానికి నిదర్శనమని ఆర్జేడీ పార్టీ మండిపడింది.

ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions