Tuesday 5th May 2026
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ కు యూకే మాజీ ప్రధాని లేఖ

సీఎం రేవంత్ కు యూకే మాజీ ప్రధాని లేఖ

UK Former PM Tony Blair Writes Letter To Cm Revanth Reddy | యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను రాశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి తెలంగాణ రైజింగ్ – 2047 దార్శనికతతో ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయని సీఎంకు యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ లేఖ రాశారని పేర్కొంది.

ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయిర్ తో ముఖ్యమంత్రి సమావేశమైన విషయం తెల్సిందే. ఆ సందర్భంగానే తెలంగాణ రైజింగ్ 2047 ముఖ్యమంత్రి వివరించారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడం, పెట్టుబడులను ఆకర్షించడం, రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యతనిస్తూ, మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ, ఇతర రంగాల్లో లక్ష్యాలు, వాటిని సాధించుకునే మార్గాలను వివరించారు.

ఈ భేటీ సందర్భంగానే తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, అమలుకు సంబంధించి టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. తెలంగాణ రైజింగ్ విజన్‌లోని స్పష్టత, నిర్దేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయంటూ తాజాగా రాసిన లేఖలో టోనీబ్లెయిర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేసినట్లు సీఎంఓ తెలిపింది.

తెలంగాణ విజన్‌కు అనుగుణంగా లక్ష్యాల సాధనకు భారతదేశంలోని TBIGC ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరిస్తారని లేఖలో యూకే మాజీ ప్రధాని తెలిపారు. తదుపరి కార్యాచరణపై ముందుకు వెళ్లడానికి ఏవైనా సందేహాలుంటే తెలంగాణ అధికారులు TBIGC భారత ప్రతినిధిని సంప్రదించవచ్చని ఆ లేఖలో టోనీబ్లెయిర్ పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ఆ లేఖలో రాశారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
engineering fee in tg
రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు.. అత్యధికం ఎంతంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions