Thursday 17th September 2026
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్ బోనాలు..నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్ బోనాలు..నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

Hyderabad Bonalu 2025 | హైదరాబాద్ నగరంలో బోనాల సందడి మరికొన్ని రోజుల్లో నెలకొననుంది. ఈ క్రమంలో జంట నగరాల్లో బోనాల నిర్వాహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను మంజూరు చేసింది.

ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 20 కోట్ల 2783 దేవాలయాలకు వివిధ కార్యక్రమాలు నిర్వహణకై చెక్కుల రూపంలో నిధులు జారీ చేయడం జరిగిందని వెల్లడించారు.

తెలంగాణ సంప్రదాయానికి, నిర్దిష్ట విధి విధానాల చట్రానికి అతీతంగా ఉండే మాతృదేవతారాధన, గ్రామీణ దేవతారాధన లోంచి పుట్టిన బోనాలు క్రమక్రమంగా సాంప్రదాయంగా ఏర్పడటం ఒక విశేషమన్నారు.

ఆషాడ మాసంలో ముందుగా నగరంలో గోల్గొండ బోనాలు జూన్ 29న, జూలై 1,2 తేదీలలో బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, జూలై 13,14 తేదీలలో శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో, జూలై 20 న లాల్ దర్వాజా బోనాలు అలాగే జూలై 23 న చార్మినార్ భాగ్యలక్ష్మి బోనాలు ఆ తర్వాత మిగిలిన దేవాలయాల బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions