Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘బస్తీ దవాఖానపై బురద..ప్రైవేట్ హాస్పిటల్ కు లబ్ది’

‘బస్తీ దవాఖానపై బురద..ప్రైవేట్ హాస్పిటల్ కు లబ్ది’

Telangana health minister hits back at BRS over Basti Dawakhanas | బస్తీ దవాఖాన్ల ద్వారా ప్రతి రోజూ సుమారు 45 వేల మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. అన్ని రకాల మెడిసిన్ బస్తీ దవాఖాన్లలో అందుబాటులో ఉన్నాయన్నారు.

డయాగ్నస్టిక్స్ హబ్స్ ద్వారా బస్తీ దవాఖాన్లకు వచ్చే పేషెంట్లకు 134 రకాల టెస్టులు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ పేదలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ హాస్పిటళ్లపై కొంతమంది బురద జల్లుతున్నారని మండిపడ్డారు. బీఆరెస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు మరియు ఇతర నాయకులు తాజగా బస్తీ ధవాఖానాల్లో సందర్శించారు. వసతులు సరిగ్గా లేవని, మెడిసన్లు అందుబాటులో లేవని అలాగే డాక్టర్లకు జీతాలు సకాలంలో అందడం లేదని విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో మంత్రి దామోదర స్పందించారు. రాజకీయ లబ్ది కోసం ప్రజాప్రతినిధులే తప్పుడు ప్రచారం ద్వారా ప్రభుత్వ హాస్పిటళ్లపై నమ్మకం సన్నగిల్లేలా చేయడం దురదృష్టకరమన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చే విధంగా వారు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి స్పష్టం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions