SSMB29 Update | సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamauli) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. Ssmb29 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లిమ్ప్స్ ను నవంబర్ 15న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఈవెంట్‌లోనే సినిమా అధికారిక టైటిల్‌ను ప్రకటించి, ఓ పవర్‌ఫుల్ గ్లిమ్ప్స్ ను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.









