August 15.. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు. 200 ఏళ్ల బానిసత్వపు కోరల నుంచి భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న శుభదినం.
ఎంతో మంది త్యాగధనుల రక్తంతో స్వాతంత్య్రం సిద్ధించిన రోజు. కుల, మత, జాతులకు అతీతంగా ప్రతి గుండె దేశభక్తితో ఉప్పొంగే సుదినం.
అందుకే ఈ ఆగస్టు ప్రతీ భారతీయుడికీ ప్రత్యేకమైన రోజు. ఈ దేశం స్వతంత్య్ర భారతావనిగా ఆవిర్భవించి ఈ ఏడు 75వ వసంతంలోకి అడుగిడబోతోంది.
Read Also: భగత్ సింగ్ పోరాడింది.. అల్లూరి ఎదురెళ్లింది ఇందుకు కాదు.. ఇంకేదో కారణముంది!
దేశవ్యాప్తంగా సంబరాలకు ఎర్రకోట నుంచి ఎర్రవల్లి వరకు ప్రతి పల్లే.. ప్రతి గల్లీ ముస్తాబైంది. మువ్వన్నెల జెండా రెపరెపలాడబోతోంది.
ప్రతి కన్నూ ఆ జెండాను చూసి పులకరిస్తుంది.. ప్రతి చేయి ఆ జెండాకు సలాం చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రతి గళం జాతీయ గీతాన్ని ఆలపించేందుకు తహతహలాడుతోంది.
మిగతా 364 రోజులు ఎన్ని కష్టాలు ఉన్నా.. ఎన్ని బాధలు ఉన్న పక్కన బెట్టి యావత్ భారత జాతి మొత్తం పండగ చేసుకునేందుకు సిద్దమైంది.
ఆగస్టు 15వ తేదీన మన దేశంతో పాటు మరో మూడు దేశాలు కూడా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి.
అవి ఏవంటే.. ఒకటి దక్షిణ కొరియా. ఈ దేశం 1945 ఆగస్టు 15న జపాన్ నుంచి స్వాతంత్య్రం పొందింది.
రెండోది కాంగో. 1960వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందింది. మూడోది బహ్రెయిన్. ఈ దేశం 1971న ఆగస్టు 15న బ్రిటన్ నుండి స్వాతంత్య్రం పొందింది.
అయితే మన దేశానికి ఆగస్టు 15నే స్వాతంత్య్రం ఎందుకు ప్రకటించారు. ప్రత్యేకంగా ఆ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దానికీ ఓ కారణం ఉంది.
Read Also: మరణించినా మళ్లీ జీవించండి.. మరొకరికి జీవితాన్నివ్వండి!
వాస్తవానికి 1947 జూలై 18 తేదీనే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆమోదం పొందింది. అంటే భారతదేశానికి అధికారికంగా స్వాతంత్య్రం వచ్చిన రోజు.
కానీ అప్పటి, చివరి వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ వేరేలా ఆలోచించారు. ఇండియా ఇండింపెండెన్స్ డే కోసం.. ఆగస్టు 15వ తేదీని ఎంచుకున్నారు. అది ఆయనకు అదృష్టమైన రోజంట.
అంతకు రెండేళ్ల ముందు 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో మిత్రరాజ్యాల దళాలకు జపాన్ ఇదే రోజున లొంగిపోవడమే ఇందుకు కారణం.
మనకు ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే.. పాకిస్తాన్ కు ఒక రోజు ముందుగానే వచ్చింది. వాళ్లకు 14వ తేదీనే ఇండిపెండెన్స్ డే. ఇందుకు కారణం తెలిస్తే చాలా సిల్లీగా అనిపిస్తుంది.
Read Also: కర్రీ అనొద్దు.. పప్పు పలకొద్దు.. ఏమిటీ విడ్డూరం!
అఖండ భారతావనికి చివరి వైశ్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్.. ఇటు ఇండియా, అటు పాకిస్తాన్ దేశాల్లో స్వాతంత్య్రం వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది.
కానీ రెండు సంబురాలు ఒకే రోజు. ఒకరోజు రెండు దేశాల్లో వేడుకలకు పాల్గొనడం ఇబ్బంది అనుకున్నారో, సాధ్యం కాదని భావించారో ఏమో.. పాకిస్తాన్ కు ఒక రోజు ముందుగానే స్వాతంత్య్రం ఇచ్చేశారు.
మనకు స్వాతంత్య్రం ప్రకటించాక.. పంజాబ్, బెంగాల్ రాష్ట్రాలు ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉండిపోయాయి.
దీంతో వీటిని విభజించేందుకు బ్రిటిష్ లాయర్ సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ కు అప్పగించారు బాధ్యతలు.
1947 ఆగస్టు 3వ తేదీనే ఈ వ్యవహారం పూర్తయింది. కానీ, మనకు స్వాతంత్య్రం వచ్చిన రెండు రోజుల తర్వాత ఆగస్టు 17వ తేదీన అధికారికంగా పబ్లిష్ చేశారు బ్రిటీషోళ్లు.
Read Also: రాజకీయాల్లో నేరస్తులు అధికమయ్యారు.. సుప్రీం సంచలన తీర్పు!
అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రాడ్ క్లిఫ్ అనేటాయన.. ఎన్నడూ ఇండియా ముఖం కూడా చూడలేదు.
ఇక్కడి పరిస్థితులేంటో కూడా తెలియదు. వచ్చేసి ఇష్టమొచ్చినట్లు విభజించి వెళ్లిపోయాడు.
మనకు స్వాతంత్య్రం ఇచ్చే విషయంలో బ్రిటీషోళ్ల తీరుకు నిదర్శనం పై ఘటనలు..
చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే ఉన్నాయి. సిల్లీ కారణాలతో స్వాతంత్య్రాన్ని ఆలస్యం చేశారు.
200 ఏళ్లు తమ బూటుకాలి కింద మనల్ని నలిపేసిన వాళ్లను.. సడన్ గా వెళ్లిపోమంటే కష్టమే కదా.. అధికారం, అజమాయిషీ, డబ్బు.. ఇవన్నీ కోల్పోతామనే బాధ ఉంటుంది కదా.. వాళ్లలో అదే కనిపించింది!
.



Great article!