Saturday 27th July 2024
12:07:03 PM
Home > తాజా > తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం.. ఎవరంటే!

తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం.. ఎవరంటే!

cp radhakrishnan

Telangana New Governor | తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై సౌందర రాజన్ (Tamilisai Soundararajan) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఆమోదించారు.

అనంతరం రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను నియమించారు. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న సీపీ రాధాకృష్ణన్‌‌ (CP Radhakrishnan)కు తెలంగాణ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. తమిళి సై స్థానంలో పుదుచ్చేరి (Puducherry) లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గానూ రాధాకృష్ణన్ కే అదనపు బాధ్యతలు ఇచ్చారు.

తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ బీజేపీలో క్రియాశీలకంగా పని చేశారు. కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1998, 1999లో ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగానూ సేవలదించారు.

2004, 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. తాజాగా ఆయన్ను తెలంగాణకు గవర్నర్‌గా, పుదుచ్చేరికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

You may also like
Single Screen Theatre
రాష్ట్రంలో రెండు వారాలు థియేటర్లు బంద్.. ఎందుకంటే!
Election commission
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ.. బరిలో ఎంతమందంటే!
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటి!
revanth reddy
ఎవరినీ బయటకి పంపేది లేదు.. వాళ్లకు అదే సరైన శిక్ష: సీఎం రేవంత్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions