Kannappa Release Date | టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను మొదట ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే తాజాగా కన్నప్ప రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మంచు విష్ణు తన ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్తూ అధికారికంగా పోస్టు చేశారు. మంచు విష్ణు తన పోస్ట్ లో.. కన్నప్ప సినిమాని తీసుకురావడం ఒక అద్భుతమైన ప్రయాణం. మేం హై స్టాండర్డ్స్ తో ఒక మంచి అవుట్ ఫుట్ ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం.
అందుకోసం ఇంకొన్ని వారాలు సమయం పడుతుంది. కొన్ని VFX వర్క్స్ ఇంకా బెటర్ చేస్తున్నాము. అందుకే సినిమా రిలిజ్ కి కొంత సమయం పడుతుంది. కన్నప్ప సినిమా శివుడికి మేమిచ్చే గిఫ్ట్ లాంటిది. సినిమా వాయిదా పడుతున్నందుకు అర్ధం చేసుకుంటారు అని కోరుకుంటున్నాను. మా టీమ్ సినిమా మీదే పని చేస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాము అని తెలిపారు మంచు విష్ణు.