Allu Arjun Atlee Combo | పుష్ఫ (Pushp) సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇక పుష్ప2 (Pushpa2) హిట్ తో బన్ని నెక్స్ట్ మూవీస్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే ఓ క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. ఇటీవల బన్నీ కోలీవుడ్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి.
తాజాగా అది నిజమేనని అధికారింగా తేలింది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో సన్ పిక్చర్స్ సంస్థ ఓ సినిమా నిర్మించబోతోంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనుల వీడియోను మంగళవారం సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.
ఈ సినిమాను ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేసినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ముందెన్నడూ లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీ తో ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ వీడియోలో అల్లు అర్జున్, అట్లీ, నిర్మాత అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఓ పెద్ద వీఎఫ్ ఎక్స్ సంస్థ నిపుణులతో చర్చిస్తున్న విజువల్స్ ఉన్నాయి. దీన్ని బట్టి హాలీవుడ్ తరహాలో అల్లు అట్లీ కాంబో సినిమాను రూపొందిస్తారని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.