Allu Arjun and Trivikram film from October | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో కొత్త సినిమా పట్టాలెక్కనున్న విషయం తెల్సిందే.
ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ను నిర్మాత నాగవంశీ మీడియాతో పంచుకున్నారు. సోషియోఫాంటసీ మూవీ అంటూ జరుగుతున్న ప్రచారం పై నాగవంశీ స్పందిస్తూ..బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో రాబోయే సినిమా మైథలాజికల్ జానర్ లో తెరకెక్కనున్నట్లు స్పష్టం చేశారు.
అక్టోబర్ నుండి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ దేవతల సర్వ సైన్యాధ్యక్షుడు కుమారస్వామి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. దింతో సోషల్ మీడియాలో కుమారస్వామిగా అల్లు అర్జున్ ఉన్న జీబ్లీ ఇమేజులు వైరల్ గా మారాయి.
ఇకపోతే అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో కూడా ఓ సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. పుష్ప-2 తో అల్లు అర్జున్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దింతో ఆయన తదుపరి సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.