Kangana Ranaut House Power Bill | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.
హిమాచల్ ప్రదేశలోని మనాలీలో ఆమె ఇంటికి కరెంట్ బిల్ రూ. లక్ష వచ్చింది. దీంతో ఆ బిల్ చూసిన ఆమె హిమాచల్ ప్రదేశ్ లో కొలువున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అసలు ఆ ఇంట్లో నివాసమే ఉండటం లేదనీ, అలాంటప్పుడు అంత మొత్తంలో బిల్లు ఎలా వస్తుందని నిలదీశారు. ఈమేరకు ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు కంగనా.
‘మనాలీలో ఉన్న మా ఇంటికి ఈ నెల రూ. లక్ష కరెంట్ బిల్లు వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను ఆ ఇంట్లో ఉండటం లేదు. దీంతో ఆ బిల్లు చూసి షాకయ్యా. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం సిగ్గుచేటు.
అయినప్పటికీ మనందరికీ ఒక అవకాశం ఉంది. నా సోదరీ సోదరులను నేను కోరేది ఒక్కటే. ఇలాంటి సమస్యలపై మనమంతా క్షేత్రస్థాయిలో పనిచేయాలి.
దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ తోడేళ్ల చెర నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం” అని ఆమె వ్యాఖ్యానించారు.