Friday 31st July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ట్రంప్ ప్రమాణం..అదే సమయంలో పుతిన్-జిన్ పింగ్ వీడియో కాల్

ట్రంప్ ప్రమాణం..అదే సమయంలో పుతిన్-జిన్ పింగ్ వీడియో కాల్

Putin and Xi hold video call in show of unity hours after Trump inauguration | అమెరికా దేశ 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే.

ఇదే సమయంలో అమెరికా ప్రత్యర్థి దేశాల అధినేతలు వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin ) , చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ( Xi Jinping ) వీడియో కాల్ ద్వారా చర్చలు జరుపుకున్నారు.

జిన్ పింగ్ ను ‘మై డియర్ ఫ్రెండ్’ ( My Dear Friend )అంటూ సంభోదించిన పుతిన్ ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత వృద్ధి చేసుకోవాలన్నారు. ఈ పరిణామం అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది.

కాగా ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్-రష్యా యుద్దానికి ముగింపు పలికేలా ఒప్పందం చేసుకోవాలని చెప్పారు.

కానీ పుతిన్ సంధి కుదుర్చుకోకుండా రష్యాను నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. అయితే త్వరలోనే తాను పుతిన్ తో భేటీ అవనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా చైనాను ఎకనమీ ( Economy ) మరియు ఇతర విషయంలో పోటీదారుగా భావిస్తుండగా, రష్యాను పెద్ద ముప్పుగా పరిగణిస్తుంది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions