Friday 14th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నాలుగున్నర కిలోల గోల్డ్..ప్రియాంక గాంధీ ఆస్తుల వివరాలు

నాలుగున్నర కిలోల గోల్డ్..ప్రియాంక గాంధీ ఆస్తుల వివరాలు

Priyanka Gandhi Assets | జాతీయ కాంగ్రెస్ ( INC ) జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ( Priyanka Gandhi Vadra ) వయనాడ్ ( Wayanad ) పార్లమెంటు స్థానం ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు.

బుధవారం భారీ ర్యాలీ, సభ అనంతరం ఆమె అఫిడవిట్ ( Affidavit ) ను సమర్పించారు. తనకు మొత్తంగా రూ.12 కోట్ల ఆస్తులు ఉన్నాయని, భర్త రాబర్ట్ వాద్రా పేరుమీద రూ.65 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

రూ.7 కోట్లకు పైగా స్థిర, రూ.4 కోట్లకు పైగా చరాస్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ శిమ్లా ( Shimla )లో సొంతంగా ఒక బంగ్లా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా తనకు రూ.15.75 లక్షల అప్పులు ఉన్నాయని చెప్పారు. భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ ( Honda CRV ) కారును అఫిడవిట్ లో పొందుపరిచారు.

రూ. 1.15 కోట్లు విలువ చేసే 4,400 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్ లో రాశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) వయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. నవంబర్ 13న ఈ సీటుకు ఎన్నిక జరగనుంది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions