Sunday 8th September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సౌత్ టార్గెట్.. దక్షిణాది నుంచి మోదీ పోటీ.. ఎక్కడి నుంచంటే!

సౌత్ టార్గెట్.. దక్షిణాది నుంచి మోదీ పోటీ.. ఎక్కడి నుంచంటే!

modi

Narendra Modi | వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ ఈసారి దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేసింది.

భారతీయ జనతా పార్టీ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 303 సీట్లు గెలిచింది. కానీ అందులో కేవలం 29 సీట్లను మాత్రమే దక్షిణ రాష్ట్రాల్లో గెలిచింది.

ప్రారంభం నుండి బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ, హిందీ పార్టీ, బ్రహ్మాన్ బనియా పార్టీ అని ప్రచారం ఉంది.

ఈ ముద్రను చెరిపేసుకోవడానికి బీజేపీ ఎప్పటినుండో ప్రయత్నిస్తోంది. కానీ కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఆశించిన ఫలితాలను సాధించలేదు.

రాబోయే ఎన్నికల్లో దక్షిణ భారత్ లో పాగా వేయడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ దక్షిణాది నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది.

తమిళనాడులోని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన రామేశ్వరం నుండి మోదీ పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

రామేశ్వరం (రామనాథపురం నియోజకవర్గం) నుండి పోటీ చెయ్యడం ద్వారా తమిళనాడు లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని బీజేపీ ఆలోచిస్తుంది.

అలాగే కొరకరాని కొయ్య లాగా ఉన్న డీఎంకే పార్టీకి చెక్ పెట్టాలని వ్యూహాలను రచిస్తోంది.

2014 నుండి ప్రసిద్ధ శైవక్షేత్రం అయిన వారణాసి నుండి మోదీ పోటీ చేస్తు వస్తున్నారు. ఇప్పుడు వారణాసితో పాటు రామేశ్వరం నుండి కూడా పోటీ చేయనున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతుంది.

దీనికి సంబంధించిన సంకేతాలు తమకి అందాయని తమిళనాడు బీజేపీ వర్గాలు తెలుపుతున్నాయి.
రామేశ్వరం పార్లమెంట్ పరిధిలో ముస్లిం జనాభా కూడా అధికంగా ఉంటుంది.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే పార్టీతో పొత్తులో భాగంగా ఐఎంయూఎల్ ఇక్కడి నుండి పోటీ చేసి విజయం సాధించింది.

రామేశ్వరంలో పోటీ చేయడం ద్వారా కేవలం తమిళనాడు లోనే కాకుండా దక్షిణ భారత్ లో ఉన్న మొత్తం ఐదు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవలని చూస్తుంది.

మరి మోదీ రామేశ్వరం నుండి పోటీ చేస్తారా ? లేదా ? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

You may also like
Modi Revanth Reddy
సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్!
PM Modi
ఆ ఘటనపై బహిరంగ క్షమాపణ చెప్పిన ప్రధాని మోదీ!
modi
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని పర్యటన!
pm modi
కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం: ప్రధాని మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions