Pawan kalyan visits tirupathi
పవన్ కళ్యాణ్ (pawan kalyan) వారాహి యాత్ర మొదలుపెట్టినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఇటీవల శ్రీకాళహస్తిలో (srikalahasthi) జనసేన నేత కొట్టే సాయి పై సీఐ అంజు యాదవ్ (anju yadav) చేయిచేసుకున్నారు. అంజు యాదవ్ ప్రవర్తన పట్ల జనసేన కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ చర్యను వారు ఖండించారు.
తమ పార్టీ నేతలు, కార్యకర్తల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై జనసేనని ఆగ్రహించారు. ప్రభుత్వం అండతో పోలీసులు తమ నాయకుల పైన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
జనసేన పార్టీ తమ నాయకులని, కార్యకర్తలని కాపాడుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే సీఐ అంజు యాదవ్ పై ఫిర్యాదు చెయ్యడానికి పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు.
janasenani files complaint| జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలుత గన్నవరం విమానాశ్రయం (gannavaram airport) నుండి రేణిగుంట చేరుకొని తర్వాత తిరుపతికి వెళ్లారు. తిరుపతి పట్టణంలో అభిమానుల భారీ ర్యాలీతో ఎస్పీ ఆఫీస్ కు పవన్ చేరుకున్నారు.
శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ పైన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ( sp parameshwar reddy) పవన్ కళ్యాణ్ పిర్యాదు చేశారు. సీఐ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని ఎస్పీకి అందజేశారు.