Tuesday 5th August 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > AP Cabinet: పవన్ కళ్యాణ్ కు కేటాయించే శాఖలు ఇవే(నా)!

AP Cabinet: పవన్ కళ్యాణ్ కు కేటాయించే శాఖలు ఇవే(నా)!

pawan kalyan

Pawan Kalyan Portfolio | నవ్యాంధ ప్రదేశ్ సీఎంగా (AP CM Chandra Babu) చంద్రబాబుతోపాటు, మంత్రులుగా పవన్ కళ్యాణ్ సహా 24 మంది ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

కాగా, గురువారం సాయంత్రం చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం మంత్రులందరికీ శాఖలు కేటాయించే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పైనే ఉంది.

ఇప్పటికే పవన్ కు డిప్యూటీ సీఎం బాధ్యతలు కన్ ఫాం అయినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఏ శాఖ బాధ్యతలు చేపడతారోనని ఏపీతోపాటు తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో హోం శాఖ బాధ్యతలు చేపడతారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే వ్యవసాయంపై మక్కువ ఉన్న పవన్ వ్యవసాయంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇక నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు సమాచారం. మొత్తానికి ఈరోజు సాయంత్రంతో ఈ వార్తలన్నింటికీ బ్రేక్ పడనుంది.

You may also like
మళ్లీ త్యాగానికైనా సిద్ధమే..కోమటిరెడ్డి సంచలనం
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ కన్నుమూత
‘కాళేశ్వరం కమిషన్ పై చర్చ పెట్టండి..చీల్చి చెండాడుతాం’
మహిళలకు ఉచిత ప్రయాణం..పథకం హైలైట్స్ ఇవే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions