Wednesday 16th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట

New Delhi Railway Station Stampede | న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. కుంభమేళా ( Maha Kumbhmela )కు భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది.

శనివారం రాత్రి కుంభమేళాకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్ లోని 14వ ప్లాట్ఫార్మ్ ( Platform ) వద్దకు ప్రయాణికులు భారీగా చేరుకున్నారు. అప్పటికే కుంభమేళాకు వెళ్లే స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యం అయ్యాయి.

ఈ క్రమంలో ప్రయాణికులు స్టేషన్ లోని 12,13, 14 నంబర్ ప్లాట్ఫార్మ్ పై ఉన్నారు. ఇదే సమయంలో 14వ ప్లాట్ఫార్మ్ పై ప్రయాగ్రాజ్ ఎక్స్ ప్రెస్ ( Prayagraj Express ) రైలు చేరుకుంది. దీంతో అక్కడ రద్దీ పెరిగి తొక్కిసలాటకు దారి తీసింది.

ఈ దుర్ఘటనలో బీహార్ కు చెందిన తొమ్మిది మంది, ఢిల్లీకి చెందిన ఎనమిది మంది మరియు హర్యానకు చెందిన ఒకరు ఉన్నారు. వీరిలో చిన్నారులు సైతం ఉన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరోవైపు మృతుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions