Nandamuri Balakrishna | టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన వీరసింహా రెడ్డి (Veerasimha Reddy) చిత్రం సంక్రాంతి (Sankranthi) బరిలో దూసుకుపోతోంది.
సినిమాపై మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ కలెక్షన్లలో రికార్డులు కొల్లగొడుతోంది. బాలయ్య పాత్రను తీర్చిదిద్దిన తీరుపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలో బాలయ్య పలికిన డైలాగులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వీరసింహా రెడ్డి సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల మోత మోగిస్తున్న తరుణంలో బాలయ్య చేసిన చిన్న పొరపాటు వల్ల వివాదం చెలరేగింది.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని వ్యాఖ్యానించారు. దీనిపై దేవ బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో వివాదంపై బాలయ్య స్పందించారు. ఈ క్రమంలో హుందాగా వ్యవహరిస్తూ దేవ బ్రాహ్మణులకు క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
Read Also: Nepalలో ఘోర విమాన ప్రమాదం.. భారీగా మృతుల సంఖ్య!
పొరపాటు జరగిందనీ, తన వాళ్లను బాధ పెట్టకుంటానా అంటూ దేవబ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలకు తన ప్రకటనలో వివరణ ఇచ్చారు.
“దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ అని నాకు అందిన సమాచారం తప్పని తెలియజేసిన దేవ బ్రాహ్మణుల పెద్దలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నేనన్న మాటవల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను.
నాకు ఎవరినీ బాధపెట్టాలన్న ఆలోచన లేదు, ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.
అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకు వచ్చే ప్రయోజం ఏముంటుంది చెప్పండి? పైగా దేవాంగులలో నా అభిమానులు చాలా మంది ఉన్నారు. నావాళ్లను నేను బాధ పెట్టుకుంటానా?
అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను. మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ” అని బాలయ్య తన లేఖలో పేర్కొన్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లోకి వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహా రెడ్డి సినిమాకు ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాశారు.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. బాలయ్య సరసన హనీరోజ్, శ్రుతి హాసన్ నటించారు.
ప్రముఖ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత కుమార్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.