Mahesh Babu Writes Letter to ED Officials | నటుడు మహేష్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఆదివారం లేఖను రాశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆదివారం, సోమవారం విచారణకు హాజరవ్వలేనని మహేష్ లేఖలో పేర్కొన్నారు.
షూటింగ్ లో బిజీగా ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కోరారు. కాగా మహేష్ బాబుకు ఇటీవలే ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఏప్రిల్ 27న విచారణకు హాజరవ్వాలని అందులో పేర్కొంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న సూరానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో మహేష్ బాబు నటించారు.
అయితే ప్రకటనలో కోసం రూ.5.9 కోట్లు మహేష్ బాబు పారితోషకం తీసుకున్నారు. కానీ ఇందులో రూ.3.4 కోట్లు చెక్కు రూపంలో తీసుకోగా, మరో రూ.2.5 కోట్లను నగదు రూపంలో తీసుకున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఇది మనీ లాండరింగ్ కిందకు వస్తుందని పేర్కొన్న ఈడీ కేసు నమోదు చేసి మహేష్ బాబును విచారణకు హాజరవ్వాలని తెలిపింది. ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే