Saturday 27th July 2024
12:07:03 PM
Home > సినిమా > క్రేజీ టైటిల్ తో కీర్తి సురేశ్.. ఆకంటుకుంటున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్!

క్రేజీ టైటిల్ తో కీర్తి సురేశ్.. ఆకంటుకుంటున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్!

Revolver Rita | ‘నేను శైలజ’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచమైన మలయాళ కుట్టి కీర్తి సురేశ్ (Keerthy Suresh) మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో తన అద్భుతమైన నటనకు గానూ ఏకంగా నేషనల్ అవార్డు గెలుచుకొంది.

దీంతో కీర్తి సురేశ్ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఎంపిక చేసుకుంది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా తన నటనతో మాత్రం ఆకట్టుకుంది.

మరోవైపు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోనూ గ్లామర్ తో అదరగొడుతోంది. మహేశ్ సరసన సర్కారు వారి పాటలో గ్లామర్ డోస్ (Glamor) పెంచి కుర్రకారు మది దోచింది.

ప్రస్తుతం కీర్తి తెలుగులో దాదాపు అర డజను సినిమాలు చేస్తోంది. చిరంజీవి (Chiranjeevi) మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్ (Bhola Shankar) లో మెగాస్టార్ కి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.

Read Also: తెలుగు రాష్ట్రాల్లోకి వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!

నానితో కలసి ‘దసరా’ మూవీ చేస్తుంది. దీంతోపాటు చంద్రు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు ఓ క్రేజీ టైటిల్ ను పెట్టారు.

రివాల్వర్ రిటా (Revolver Rita) అనే వెరైటీ టైటిల్ తో వస్తున్న సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ (Firstlook) రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఈ పోస్టర్ లో కీర్తి సురేశ్ రెండు చేతుల్లో రెండు రివాల్వర్లను పట్టుకుని ఉంది. పెయింటింగ్‌తో డిజైన్‌ చేసిన ఈ పోస్టర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions